వైకాపా రాజీనామాలు డ్రామా : జేసీ దివాకర్ రెడ్డి

Date:14/02/2018
అమరావతి ముచ్చట్లు:
జాతీయ స్థాయిలో చంద్రబాబు ఎదగా కూడదనే  కుట్ర జరుగుతుంది. గతంలో మూడవ కూటమి విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారనే మోడీ కి ఉందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ముకేశ్ అంబానీ కూడా సీఎం ను మరింత ఉన్నత స్థానికి ఎదగాలని కోరుకున్నారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా ప్రధాని మరిచి పోయారు. జగన్ తన పార్టీల ఎంపీల చేత చేయించే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని అయన వ్యాఖ్యానించారు. రాజీనామాల వల్ల కాదు. ప్రజల్లో చైతన్యం వస్తేనే రాష్ట్ర విభజన హామీలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే ఇంకొ ఇద్దరికి మోడీ మంత్రులుగా అవకాశం ఇస్తాడు .అంతకు మించి ఏమి ఉండదని అన్నారు. మా భావాలు ఎమున్నా సీఎం చంద్రబాబుతో చర్చించాకా నిర్ణయం తీసుకుంటాం. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం,మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లే నని అన్నారు, వైసీపీ నిజంగా ప్రజలకు మేలుచెయ్యాలి అంటే,నరేంద్ర మోడీ కి బుద్ది వచ్చేటట్లు చెయ్యాలని అన్నారు. బై ఎలక్షన్ తప్పించుకోవడానికే వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా. బీజేపీ కి బుద్ది వచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తారని జేసీ అన్నారు. ఎవరు రాజీనామాలు చెయ్యాలి అనే విషయం సీఎం చంద్రబాబు చెప్తారు. ఏప్రిల్ తరువాత వైసీపీ రాజీనామా చేసినా ఎటువంటి ప్రయోజనంలేదు. బీజేపీ తో మిత్రపక్షం కొనసాగాలా,వద్దా అనే విషయం టీడీపీ అధిష్టాన నిర్ణయమని అయన స్పష్టం చేసారు.
Tags: Vikas resignations Drama: JC Diwakar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *