గ్రామవ్యవస్థ పటిష్టం-ఎమ్మెల్యే రోజా

చిత్తూరు ముచ్చట్లు:
 
మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భారతదేశంలోనే అమలు చేస్తున్న రోజును గణతంత్ర దినోత్సవంగా నేడు దేశ ప్రజలందరూ జరుపుకుంటున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రంలో  జరగని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అంబేద్కర్ యొక్క ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి. పుత్తూరు డిగ్రీ కళాశాల లో ఘనంగా 73 వ రిపబ్లిక్ డే వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్బంగా శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా పేర్కోన్నరు.  ఈరోజు గ్రామ సచివాలయం ద్వారా గ్రామ వ్యవస్థను పటిష్టం చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి  జగన్ అలాగే నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియాని తీసుకువచ్చి ప్రతి పేదవాడికి ఉన్నత విద్యను అందిస్తూ ఉన్నారు మహిళా సాధికారిక చట్టం ద్వారా ప్రతి మహిళకు అన్నిట్లో సమాన హక్కు కల్పిస్తూ దిశ చట్టం ద్వారా భద్రతను కల్పిస్తూ మహిళలు ముందుకు నడిపిస్తున్న జగనన్న అలాగె అభివృద్ధి, సంక్షేమానికి అగ్రపీఠం వేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు.
 
 
నూతనంగా ప్రకటించిన జిల్లాల పేర్లు ఆ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వారి పేర్లను జిల్లాలకు పెట్టడం భవిష్యత్ తరాలకు వారు రాష్ట్రానికి చేసిన సేవలను విశేష కృషిని భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా వారి పేర్లను  పెట్టడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు  కృతజ్ఞతలు తెలిపారు.పార్టీలో ఉంటూ పార్టీ పదవులు అనుభవిస్తూ పార్టీ పేరు చెప్పుకుంటున్న నాయకులు సిగ్గు తెచ్చుకునే విధంగా నేడు కృష్ణా జిల్లా నిమ్మకూరు  స్వస్థలంకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఎవ్వరు ఊహించని విదంగా పెట్టడం చాలా గర్వ కారణం, ఒక కళాకారిణిగా  తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలా జిల్లాలకు  ప్రాముఖ్యత కలిగిన వారి పేర్లు పెట్టడం చిన్నవాడైన జగన్ ని ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉందని పొగిడారు.
న్ సి సి క్యాడర్ నుండి రోజా గౌరవ వందనం స్వీకరించారు వివిధ పోటీల్లో పాల్గొన్న  విద్యార్థిని విద్యార్థులకు ఎన్సిసి క్యాడర్కు బహుమతులు ప్రధానం చేశారు .
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Village System Strengthening-MLA Roja

Natyam ad