రసాయనాల ట్యాంకర్ ను పట్టుకున్న గ్రామస్థులు.
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామ0లో రోడ్డుపక్కన రసాయనాలు వదులుతున్న ట్యాంకర్ ను పట్టుకున్నారు గ్రామస్తులు. బాల్ ఆంట్ పరిశ్రమకు సంబంధించిన కెమికల్ ట్యాంకర్ రసాయనాలనువదులుతుండగా పట్టుకున్నారు గ్రామ యువకులు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు పరిశ్రమ ఎదుట వాగ్వాదం చోటుచేసుకుంది. అనేక పరిశ్రమల నుండి అర్ధరాత్రి సమయంలో వ్యర్ధ రసాయనాలనుట్యాంకర్ల ద్వారా రోడ్డు ప్రక్కన అలాగే మూసీ కాలువలో వదిలేస్తున్నారని ఎన్నిసార్లు పిసిబి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించినా చర్యలు తీసుకివడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాత్రి కూడా పోలీసుల తీరుకు నిరసనగా యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Tags:Villagers catch a tanker of chemicals