Virat is the cradle

విరాట్‌ శతక్కొట్టుడు

సాక్షి

Date :15/01/2018

సెంచూరియన్‌:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ చేశాడు. భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో కోహ్లి సమయోచితంగా ఆడి శతకం సాధించాడు. సోమవారం 85 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కోహ్లి..146 బంతుల్లో శతకాన్ని  పూర్తి చేసుకున్నాడు. ఇది విరాట్‌ టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీ.

కీలకమైన రెండో టెస్టులో కోహ్లి శతకంతో రాణించి భారత జట్టును గాడిలో పెట్టాడు. 183/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు కోహ్లి-హార్దిక్‌ పాండ్యాలు ఆరంభించారు. ఈ రోజు ఆటలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇదిలా ఉంచితే, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత హార్దిక్‌ పాండ్యా(15) ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. తన స్వీయ తప్పిదంతో వికెట్‌ను సమర్పించుకున్నాడు. క్రీజ్‌లో దగ్గరకు చేరినప్పటికీ బ్యాట్‌ను ఉంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాండ్యా భారంగా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

Tags: Virat is the cradle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *