విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్ వాయిదా.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
సినిమా ముచ్చట్లు:
‘ఫలక్‌నుమాదాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్న మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ విషయంలోనూ అనౌన్స్‌మెంట్‌ను డిఫరెంట్‌గా ఇచ్చారు. సినిమాలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర పేరు మీదనే ప్రకటనను వెలువరిచారు. ‘‘అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4వ తేదిన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్క్యులు నిర్దారించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం.. ఇటు అల్లం వారి పెళ్లి పిలుపు’’ అంటూ రిలీజ్ డేట్ ప్రకటనను చేయటం డిఫరెంట్‌గా ఉంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: విష్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ తదితరులు.
Tags:Vishwak Sen’s Ashokavanamlo Arjuna Kalyanam ‘Release Postponed .. New Release Date Announced Soon