మార్చి 1న బైరెడ్డిపల్లెలో వాలీబాల్‌ క్రీడాకారులు ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు:
 
జిల్లా స్థాయి యువ వాలీబాల్‌ క్రీడాకారుల ఎంపిక మార్చి1న బైరెడ్డిపల్లెలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు వాలీబాల్‌ సంఘ కార్యదర్శి కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల చేత తేదీ , స్థలం మార్చినట్లు పేర్కొన్నారు. యువ క్రీడాకారులు తమ ఆధార్‌ , పుట్టినతేదీ సర్టిఫికెట్లతో ఎంపిక కార్యక్రమానికి హాజరుకావాలెనని కోరారు. పూర్తి వివరాలకు సెల్‌ నెంబరు: 9985754900, 7981778860 లను సంప్రదించాలని కోరారు.
 
Tags: Volleyball players selected on March 1 in Byrddipalle

Natyam ad