ఓటర్ల నమోదు శని, ఆదివారాల్లో చేసుకోవాలి

Date:07/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని 39 పోలింగ్‌ కేంద్రాలలోను శని, ఆదివారాల్లో బిఎల్‌వోలు ఓటర్ల నమోదుకు అందుబాటులో ఉంటారని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఫారం 6 నందు ఓటరుగా నమోదు కావాలన్నారు.తొలగింపులకు ఫారం 7 , సవరణలకు ఫారం 8 , మార్పుల ఫారం 8ఏ నందు నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును ఆయా వార్డుల వారిగా నమోదు చేసుకోవాలని సూచించారు.పోలీంగ్‌ బూత్‌లెవల్‌ ఆఫీసర్ల వద్ద ఉన్న ఓటర్ల జాబితాను సరి చూసుకుని పట్టణ ప్రజలు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని, భారత ఓటర్లుగా నమోదు కావాలని కోరారు.

జాగ్రత్త … జనం కదలికలపై కెమెరాల కన్ను

Tags:Voters register in Saturdays and Sundays

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *