వీఆర్ఏ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

తుగ్గలి ముచ్చట్లు:
 
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు.మండల కేంద్రమైన తుగ్గలిలో వీఆర్ఏ రెండవ రిలే నిరాహార దీక్షలో భాగంగా వీఆర్ఏలు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన వీఆర్ఏ డిమాండ్లను వెంటనే పరిష్కరించి మాట నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.వీఆర్ఏలకు 21వేల జీవితాన్ని ఇచ్చి,అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు అందజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వీఆర్ఏలకు అనుసంధానం అయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి,ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏలు శేఖర్,నాగేష్,హంపయ్య మరియు తదితర విఆర్ఏ లు పాల్గొన్నారు.
 
Tags; VRA demands should be addressed immediately

Natyam ad