విఆర్ఎల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

-బద్వేల్ తహసీల్దారు కార్యాలయం ఎదుట విఆర్ఎలు రిలే నిరాహారదీక్షలు
 
బద్వేలు ముచ్చట్లు:
 
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విఆర్ఎలకు 21 వేలు వేతనం ఇవ్వాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉవసంహరించాలని, డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఎలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్క విఆర్ఎకు విఆర్వో ,వాచ్మెన్, అటేండర్  డ్రైవర్ పదోన్నతి కల్పిం చాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విఆర్ఎలకు వర్తింప చేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన విఆర్ఎ ల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బద్వేలు మండలంలోని 10 గ్రామ పంచాయితీల విఆర్ఎలు పాల్గొన్నారు.
 
Tags; VRA issues should be addressed immediately

Natyam ad