వాడరేవు సముద్రతీరంలో ఇద్దరు గల్లంతు

ఒంగోలు ముచ్చట్లు:
 
సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఉద్ధృతంగా అలలు వచ్చాయి. ఆ తాకిడికి తట్టుకోలేక ముగ్గురు విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. స్నేహితులతో కలిసి సరదగా గడిపేందుకు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతైయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో జరిగింది. వేటపాలేం బండ్ల బాపయ్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్దులు షేక్ ఆఫ్రిది, వెంకట మారుతి మరో నలుగురు స్నేహితులతో ఎన్సీసీ సర్టిఫికెట్స్ కోసం చీరాల లోని వీఆర్ఎస్ & వైఅర్ఎన్ కళాశాలకు వెళ్లారు. కళశాలలో పని ముగించుకోని సరదగా గడిపేందుకు వాడరేవు వెళ్లారు.సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన ఆలల తాకిడికి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ కాపాడగా, మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు షేక్ ఆఫ్రిది , వెంకట మారుతి ఇంకోల్లు వాసులుగా మైరెన్ పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతయినవారికోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
 
Tags: Wadarevu is a two-lane beach

Natyam ad