కడెం కాలువ మరమ్మతుల అనంతరం 5,575 ఎకరాలలోని చివరి ఆయకట్టుకు నీరు

Date:19/06/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
గత ఏడాది ఉట్నూరు పర్యటనలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి  డి-13 కాలుప పరిధిలోని రైతులు మంత్రి హరీష్ రావును కలిసి కాలువ మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కాలువ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందడం లేదని చెప్పారు. ఇందుకు స్పందించిన మంత్రి కాలువ మరమ్మతులు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి 10.47 కోట్లతో డి-13 కాలువ మరమ్మతులు చేసేందుకు పరిపాలన పరమైన అనుమతులకు మంత్రి  మంగళవారం నాడు ఆమోద ముద్ర వేశారు. డి-13 కాలువ పరిధిలో క్రాస్ డ్రైనేజీ వర్క్  పాత కాలం నాటివి, రాళ్లతో నిర్మించినవి. అవి శిధిలమైన చోట సిమెంట్ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు వంతెనలు, తూములు, డ్రాప్స్, సైఫన్, గైడ్ వాల్స్, నిర్మాణాలకు సంబంధించి రక్షణ గోడలు ( అబర్ట్ మెంట్స్) , పియర్స్ ఇలాంటి వాటి మరమ్మతులు చేపట్టనున్నారు. కాలువ కట్టలను పటిష్టం చేయడం, మొరం మట్టితో కాలువ చుట్టు మట్టిని గట్టిపరచడం, సీ.ఎన్.ఎస్ ట్రీట్ మెంట్ పనులు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు మరమ్మతులు, పూర్తిగా పాడయిన నిర్మాణాలు ఉన్న చోట కొత్తవి నిర్మించడం, 75 మిల్లీ మీటర్లు మందంతో కాలువ లైనింగ్ పనులు చేపట్టనున్నారు. తూముల షట్టర్ల మరమ్మతులు చేపట్టనున్నారు.
Tags: Water at the end of 5,575 acres after the Kadam Canal Repair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *