Waying missions at each of the godowns: Minister Raja Rajender

ప్రతి గోదాముల వద్ద వేయింగ్ మిషన్లు: మంత్రి ఈటల రాజేందర్

Date:20/06/2018

హైదరాబాద్  ముచ్చట్లు:

పౌరసరఫరాల శాఖను పూర్తి గా ప్రక్షాళన చేస్తున్నము అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే 80 శాతం సరి అయినది అని ఇంకా పూర్తిస్థాయిలో సెట్ చేస్తామన్నారు.హమాలీల సమస్యలను పరిష్కరిస్తాం. రేపు వారితో భేటీ అవుతాం అని అన్నారు.రేషన్ డీలర్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. చేతినిండా పని చేయించాలి, కడుపునిండా అన్నం పెట్టాలి అనే విధానం మాది. డీలర్లకు సప్లై చేసే బియ్యంలో బరువు తగ్గకుండా చూడాలని దానికోసం ప్రతి గోదాముల వద్ద వేయింగ్ మిషన్ లు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. పౌరసరఫరాల శాఖకు సొంతంగా ఉన్న 52 గోదాముల వద్ద పెద్ద మిషన్లు శాశ్వతంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ పాస్ మిషన్లు వచ్చిన తరువాత బియ్యం అక్రమరవాణాను అరికట్టగలిగామని. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా సానుకూలంగా ఉన్న సమయంలో మరోదఫా డీలర్లతో చర్చలు జరపాలని కమిషనర్ ని మంత్రి కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టేందుకు ప్రత్యేక చర్యలు.ఒక అధికారిక బృందం ఢిల్లీకి వెళ్లాలని మంత్రి. సూచించారు. తమిళనాడు కు బియ్యం సరఫరా చేస్తున్నామని, అలాగే భవిష్యత్తులో మన రాష్ట్రం నుండి బియ్యం సరఫరా చేయడానికి పక్కా విధివిధానాలు తయారు చేయాలని ఆదేశించారు.కడిగిన ముత్యం లా ఉండాలనేది తన లక్ష్యం అన్న మంత్రి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. పాతాళంలో ఉన్న ఈ శాఖను పైకి తీసుకువచ్చామని దీనిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఈ ఒరవడిని కొనసాగించాలని మంత్రి కోరారు. పేదరికం తగ్గాలి, ఆకలితో ఉన్నవారు లేకుండా ఉండాలనేది తన లక్ష్యం అని మంత్రి అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్ష లో సివిల్ సప్లై కమిషనేర్ అకున్ సబర్వాల్ తొపాటు , పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి గోదాముల వద్ద వేయింగ్ మిషన్లు: మంత్రి ఈటల రాజేందర్http://www.telugumuchatlu.com/waying-missions-at-each-of-the-godowns-minister-raja-rajender/

Tags; Waying missions at each of the godowns: Minister Raja Rajender

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *