బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత-కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్  ఉషా కిరణ్

నెల్లూరు ముచ్చట్లు:
హెచ్ఐవి బారిన పడిన బాధిత చిన్నారులను ఆదుకోవడం మనందరి  బాధ్యతని కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్  ఉషా కిరణ్ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కొండాయపాలెంలో ఉన్న అబైండింగ్ హోప్ చర్చ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి సోకిన చిన్నారులకు ఉషా కిరణ్ గురువారం పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంను క్రమం తప్పకుండా తీసుకుంటే హెచ్ఐవి సోకిన వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు . ఈ సందర్భంగా గా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ నెల్లూరులో ఎంతో మంది దాతలు ఉన్నారని వారందరు స్పందించి హెచ్ఐవి వ్యాధి గ్రహీత బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న నిర్వాహకులు నిర్మల్ కుమార్ ను అభినందించారు. అనంతరం పాదర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అవగాహన తోనే హెచ్ఐవిని జయించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా అసిస్టెంట్ కస్టమ్స్ కమిషనర్   ఉషా కిరణ్, మోటివేటర్ గీత, సంఘ సేవకురాలు జరినాను సత్కరించారు .ఈ కార్యక్రమంలో  సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు, విలియం, ధర్మారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:We all have a responsibility to support the victims – Assistant Commissioner of Customs Usha Kiran

Natyam ad