విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నాం-మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరంలో చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలను వినియోగించనున్నట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది. 40 కొత్త ట్రక్కులను మంత్రి కేటీఆర్, తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలించేందుకు భారీ ట్రక్కులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంతకరి తలసాని. నగర్ మేయర్
విజయలక్ష్మి తదితరులు పాల్గోన్నారు.మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఏ నగరంలో అయినా రెండు ముఖ్యమైన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. సాలిడ్,లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్కు పరిష్కారాలు వెతుకుతూ వస్తున్నాం. 2014లో 2500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం. త్వరలోనే మరో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 150 డివిజన్లలో డోర్ టు డోర్ కలెక్షన్‌కు వినియోగిస్తామన్నారు.విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి దుర్గంధం వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలి. 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అత్యాధునికమైన సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో అత్యాధునిక పద్ధతులను అవలంభిస్తున్నాం. లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ కోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువుల్లో చెత్త, గుర్రపు డెక్కను తరలించేందుకువాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పని చేయాలి అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.ఈ ట్రక్కులను రాంకీ సంస్థ  ఏర్పాటు చేసింది. ఈ వెహికల్స్ అందుబాటులోకి వస్తే రోజూ 6,500 టన్నుల చెత్తను నగరం నుంచి జవహర్ నగర్ డంప్‌నకు తరలించనున్నారు.
 
Tags:We are making Hyderabad a cosmopolitan city – Minister KTR

Natyam ad