మేమే బాధితులం..

Date:08/10/2018
అమరావతి  ముచ్చట్లు:
అనంతపురం జిల్లా తాడిపత్రి  వినాయక నిమజ్జరం రోజున చోటు చేసుకున్న ఘటనపై ప్రబోధనంద స్వామిజీ శిష్యులు సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవడానికి వచ్చారు.   రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన స్వామిజీ భక్తులు,  సీఎంకి పిర్యాదు చేసేందుకే వచ్చామని చెప్పారు తామే నిజమైన బాధితులమని వారన్నారు. ప్రబోధానంద ఆశ్రమంనుంచి జెసి దివాకర్రెడ్డి వర్గం డబ్బు డిమాండ్ చేసిందని వారు ఆరోపించారు.  డబ్బు ఇవ్వనందుకు తమపై దాడి చేశారని వారు చెప్పారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా తమపైనే కేసు పెట్టారని వారు చెప్పారు. మామీద 19 కేసులు పెట్టారని, 90 మందిని అరెస్ట్ చేసారని అన్నారు.  తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు.  జెసి వర్గీయులపై కేసు పెట్టాలని వారు అన్నారు.
Tags:We are victims ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *