ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి

Date:13/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు జబ్బుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలో ఇమ్యునైజేషన్65శాతం ఉంటే.. ఇప్పుడు దాన్ని 90శాతానికి తీసుకువచ్చామని చెప్పారు. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. 40డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసే కార్యక్రమం ఏప్రిల్ 1నుంచి ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సర్వీస్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసి .. దీని ద్వారా ప్రతి పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Tags: We are working for health Telangana: Minister Lakshmereddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *