ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఖండిస్తున్నాం: ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ ముచ్చట్లు:
కాపులను బీసీల్లో కలుపుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు బీసీ ఉద్యమ నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలిపారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ నేడు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్. కృష్ణయ్య స్పందిస్తూ.. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Tag : We condemn the AP Assembly resolution: I certainly


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *