గంజాయిరహిత సమాజ స్థాపనకు నడుంబిగించాలి

-చీలపల్లి గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించిన అసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్
 
అసిఫాబాద్ కొమురం భీం ముచ్చట్లు:
 
సమాజంలో గంజాయి నివారణకు ప్రతిఒక్కరూ నడుంబిగించాలని అసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు… సిర్పూర్ మండలంలోని చీలపల్లిలో మత్తుపదార్థాలపై పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు వలన జరిగే అనర్థాలపై అవగాహనలేమి కారణంగా  మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి సాగుచేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లు అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. గంజాయి సాగుచేసినా, వినియోగించినా ఆయా గ్రామాల్లోని నింధితులకు ఎలాంటి సంక్షేమపథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
Tags; We must work for the establishment of a cannabis-free society

Natyam ad