గ్రామీణ రోడ్ల మరమ్మత్తులను చేపడుతాం- ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను మరమ్ముత్తులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మార్లపల్లె, సింగిరిగుంట ఎస్సీ కాలనీలోని రోడ్డు, మేలుందొడ్డి, అరవపల్లె గ్రామ రహదారులను పరిశీలించారు. సింగిరిగుంట సచివాలయాన్ని పరిశీలించారు. ఎంపీపీ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో రెండు రోజుల్లో సిమెంటు రోడ్లు వేస్తామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో దెబ్బతిన్న రోడ్ల ఎస్టిమెట్లను తయారు చేసి , నివేదికలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంపామన్నారు. మంత్రి ఆదేశాల మేరకు అవసరమైన ప్రాంతాలలో మరమ్మత్తులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆంజప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.
 
Tags; We will carry out repairs on rural roads – MP Akkisani Bhaskar Reddy

Natyam ad