పుంగనూరులో ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరిస్తాం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ఎస్సీ, ఎస్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం తహశీల్ధార్‌ వెంకట్రాయులు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశం నిర్వహించారు.సమావేశానికి ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ హాజరైయ్యారు. దళిత నాయకులు శ్రీనివాసులు, నాగరాజ, శంకరప్ప, కృష్ణ్రప్ప మాట్లాడుతూ మండలంలోని అగ్రహారం వద్ద గల స్మశాన వాటిక దురాక్రమణకు గురైందని ఆరోపించారు. అలాగే స్మశానాలకు ప్రహారీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ స్మశానాలను మోడల్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్యూజ్లిఎస్‌ డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో లక్ష్మీపతి, ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రావు, ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; We will solve the problems of SCs and STs in Punganur – MP Bhaskar Reddy

Natyam ad