ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరిస్తాం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి, వారికి తగిన చేయూతనిస్తామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కమిటి సమావేశాన్ని తహశీల్ధార్‌ వెంకట్రాయులు నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతినెల సమావేశంలో వచ్చిన సమస్యలను గుర్తించి, ఆయాశాఖల అధికారులకు పంపుతున్నామన్నారు. పనుల ఒత్తిడి కారణంగా సమస్యలు కొన్ని పరిష్కారం కాలేదని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఆలస్యమైనందుకు క్షమించాలని కోరారు. స్మశానాలకు ప్రహారీలు, మంచినీరు , వసతి ఏర్పాట్లు త్వరలోనే చేపడుతామన్నారు. రాబోవు సమావేశాలలో సమస్యలను ఆనెలలో పరిష్కరించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీపతి, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌, మెంబర్లు రాజా, ప్రభాకర్‌నాయక్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: We will solve the problems of SCs and STs – MPP Bhaskar Reddy

Natyam ad