పుంగనూరు స్వచ్చసర్వేక్షణ్‌లో ముందుంటాం -చైర్మన్ అలీమ్‌బాషా
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని అన్ని వార్డుల్లోను స్వచ్చసర్వేక్షణ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, పోటీల్లో ముందుంటామని చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. శుక్రవారం కమిషనర్ రసూల్‌ఖాన్ ఆధ్వర్యంలో కోనేటిపాళ్యెంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించగా చైర్మన్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటి, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే పట్టణంలోని తడిచెత్త, పొడిచెత్త, హానికార చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నామన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన, ప్లాస్టిక్ కవర్ల నిషేధంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను పట్టణంలో పటిష్టంగా అమలుచేస్తున్నామన్నారు. మొక్కలు నాటి, ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ట్రీగార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్లు గంగులమ్మ, భారతి, నటరాజ, కాళిదాసు, జేపి.యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు ఇంతియాజ్, లక్ష్మణ్‌రాజు, ఖాన్, రమణ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; We will take the lead in the Punganur clean-up – Chairman Aleem Basha