ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకుప్రయత్నిస్తాం

వై ఎస్ అర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజారెడ్డి హామీ
 
తిరుపతి ముచ్చట్లు:
 
రాష్ట్రం లో ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) లో పనిచేస్తున్న కాంటాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సూచన మేరకు వై ఎస్ అర్ టీ యూ సి రాష్ట్ర అధ్య క్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి అడ్వర్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరించేందుకు క్రుషి చేస్తామని వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి ఉద్గాటించారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎన్ జీ ఓ హోమ్ నందు ఎన్ హెచ్ ఎం కాంటాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా మహాసభ యూనియన్ నాయకులు లోకేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అథితిగా విచ్చేసిన ఎన్. రాజారెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్త ముగా రెండు వేల మంది పని చేస్తున్నా ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శిం చారు కరోన సమయంలో కూడ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యోగం చేసిన వీరికి జీతాలను పెంచాలని, హెచ్ ఆర్ పాలసి అడగడం న్యాయ సమ్మత మేనని అన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్తిక పరిస్తితిని ద్రుష్టి లో పెట్టుకొని మీరు కూడ అడగాలని ఉద్యోగుల కు హితవు పలికారు. ఈ మహాసభలో ఏ పీ ఎన్ జీ ఓ తిరుపతి అధ్యక్షులు ఎస్. సురేశ్ బాబు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గిరిబాబు శోభ, శ్యామల, యాదగిరి, అనుశా మరియు జిల్లా వ్యాప్తిముగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటిని ఎన్నుకొన్నారు. అధ్యకులుగా: లోకేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా శోభ, ఉపాధ్యక్షులుగా మురళీ ధర్, కరుణ, కోశాధికారిగా శ్యామల, కార్య నిర్వాహక అధ్య క్షులు నళిని, సం యు క్త కార్యదర్శులు గా హరి ప్రియ, మోహిదీన్, ప్రవీణ్, అనుశా, మరియు 15మందిని సభ్యులను ఎన్నుకొన్నారు.

Tags: We will try to address the issues of NHM employees

Natyam ad