Web Media Society representatives who meet collector prisms

కలెక్టర్‌ ప్రద్యుమ్నను కలిసిన వెబ్‌ మీడియా సంఘ ప్రతినిధులు

Date:12/02/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్డేలో జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నను వెబ్‌ మీడియా వర్కింగ్‌ జర్నిలిస్ట్ యూనియన్‌ సంఘ ప్రతినిధులు కలిశారు. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు ఎస్‌.నగేష్‌, ప్రధాన కార్యదర్శి పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, కార్యదర్శి సత్యప్రసాద్‌, ప్రతాప్‌ లు కలసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీనియర్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉన్న వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నారని తెలిపారు. వెబ్‌సైట్ల , యూటూబ్‌లలో పని చేస్తున్న విలేకరులకు, యాజమాన్యాలకు అక్రీడేషన్లు మంజూరు చేసి, ప్రభుత్వ పరంగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్‌ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అలాగే సంఘ ప్రతినిధులు సమాచారశాఖ డిప్యూటి డైరెక్టర్‌ తిమ్మప్పను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగేష్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతిలో వెబ్‌మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్ యూనియన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాలో పర్యటించి, జిల్లా వారిగా సంఘాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాధారణ విలేకరులతో పాటుగా వెబ్‌ విలేకరులకు అన్ని సౌకర్యాలు కల్పించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 

Tags: Web Media Society representatives who meet collector prisms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *