ఏపీలో వీకెండ్..లాక్

విజయవాడ  ముచ్చట్లు:
 
 
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అయితే ఇటీవల సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతుండడంతో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించి పలు రాష్ట్రాల్లో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.ఒమిక్రాన్ ప్రభావంతో ఏపీలో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు 10వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధించడంతో కరోనా కేసులు తగ్గడం మొదలుపెట్టాయి. అయితే ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో.. ఇక వీకెండ్ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించలేదు. కరోనా కేసులు తగ్గకపోతే ఏపీలో వీకెండ్ లాక్ డౌన్ అనివార్యమే..!
దాడులను అరికట్టాలి
Tags: Weekend in AP..locked

Natyam ad