Chittoor YSRSCP SC section protest.

జగన్‌ పాదయాత్రకు చిత్తూరు విబేదాలతో స్వాగతం

– జెఎంసీ శ్రీనివాసులపై ఆరోపణలు
– దళితులను చులకనగా చూస్తున్నారని ప్రకటనలు
– భగ్గుమన్న విబేదాలు

Date : 27/12/2017

చిత్తూరు ముచ్చట్లు:

వైఎస్సాఆర్సీపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటన నిమిత్తం కొన్ని గంటల్లో రానున్నారు. ఈ సమయంలో జిల్లా ప్రధాన కేంద్రమైన చిత్తూరులో పార్టీ విబేదాలు వీధినపడ్డాయి. దళితులను చులకనగా చూస్తున్నారంటు దళిత సంఘ నేతలు జెఎంసీ శ్రీనివాసులపై విమర్శల వర్షం గుప్పించారు. ఒకవైపు జగన్‌పాదయాత్ర, మరోవైపు జిల్లా కేంద్రంలో విబేదాలు , జిల్లా పార్టీని విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నో రోజులుగా చాపక్రింద నీరులా సాగుతున్న పార్టీ అంతర్గత విబేదాలు భగ్గుమన్నాయి. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు రూరల్‌, అర్బన్‌ మండలాల్లో ఎస్సీలకు తగిన గుర్తింపు ఇవ్వకుండ జెఎంసీ శ్రీనివాసులు ఏకపక్షంతో వ్యవహరిస్తున్నారని దళిత సంఘ నాయకులు చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆరోపిస్తున్నారు. పార్టీకి తొలిరోజు నుంచి అండగా ఉన్న దళితులను పథకం ప్రకారం దూరం చేస్తూ తనకు కావాల్సిన వారిని నియమించుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని కాలరాచేందుకు జెఎంసీ శ్రీనివాసులు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో పార్టీ మనుగడ కష్టతరమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రం చేసి, రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Welcome to Jagan's padayatra with Chittoor Vedas
Welcome to Jagan’s padayatra with Chittoor Vedas

Tags :Welcome to Jagan’s padayatra with Chittoor Vedas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *