What is the 'Jaisimha' Fostoff?

‘జైసింహా’ ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

ఈనాడు.

Date :12/01/2018

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జైసింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార.. నటాషాదోషి.. హరి ప్రియ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. తనకు కలిసొచ్చిన సంక్రాంతి పండగ సీజన్‌లో ‘జైసింహా’గా బాలయ్య ఎలాంటి మేజిక్‌ చేశాడంటే?

ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?
కథేంటంటే: నరసింహ(బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే ఆ సమయంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్‌ చేయడంతో ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల దాడి కూడా ఎక్కువవుతుంది. మరోవైపు ఏసీపీని ఎదిరించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహా కుంభకోణంలోని పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు. నరసింహకు గౌరికీ, సంబంధం ఏంటి? తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇది బాలకృష్ణ నటించిన మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. తొలి అర్ధభాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ అభిమానులను ఆకట్టుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. దీనికి బాలకృష్ణ యాక్షన్‌ తోడవడంతో ఆయా సన్నివేశాలు రంజింపచేస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించి బాలకృష్ణ చెప్పే తీరు, పలికిన డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. మరోసారి బాలకృష్ణ తనదైన డ్యాన్సులతో అభిమానులతో ఈలలేయించారు. ముఖ్యంగా ‘అమ్మకుట్టి’ పాటలో స్టెప్‌లు ఆకట్టుకున్నాయి. కుంభకోణంలో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు ఫస్టాఫ్‌కు హైలైట్‌గా నిలిచాయి. దీంతో పాటు బ్రహ్మానందం కామెడీ నవ్వులు పూయిస్తుంది.

ఫస్టాఫ్‌ హైలైట్స్‌
+ అమ్మకుట్టి సాంగ్‌.. బాలయ్య డ్యాన్సులు
+ బ్రాహ్మణుల గురించి చెప్పే సన్నివేశం
+ ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
+ బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు

పూర్తి రివ్యూ కోసం వేచి చూడండి

Tags : What is the ‘Jaisimha’ Fostoff?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *