What Platinum Jubilee Guest House Diary Discovery

ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌ హౌస్‌ డైరీ ఆవిష్కరణ

Date: 14/01/2018

విశాఖపట్నం ముచ్చట్లు:

ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హౌస్‌ తీర్చిదిద్దిన నూతన సంవత్సర డైరీని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, లక్ష్మి ఆవిష్కరించారు. శనివారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రిజిస్ట్రార్‌ పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గెస్ట్‌హౌస్‌కువచ్చే అతిధులను చిరునవ్వుతో స్వాగతం పలకాలని, వారికి అవసరమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం సిబ్బంది సంక్రాంతికి స్వాగతం పలుకుతూ తీర్చిదిద్దిన రంగవల్లులను పరిశీలించారు. సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో గెస్ట్‌హౌస్‌ డీన్‌ ఆచార్య కె.రఘు బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: What Platinum Jubilee Guest House Diary Discovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *