కాంగ్రెస్ మహా ఓటమితో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి?

హైదరాబాద్ ముచ్చట్లు:
అసెంబ్లీ ఎన్నికలలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఇంతవరకు నాలుగు రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఆ నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ మరోమారు విజయం దిశగా దూసుకుపోతోంది. ఉత్తర ప్రదేశ్’ లో ఇంచుమించుగా 37 సంవత్సరాల తర్వాత, ఒకే పార్టీ వరసగా రెండవ సారి అదికరంలోకి రావడం ఇదే మొదటి సారి. అదే విధంగా ఉత్తరాఖండ్’లో 1990లలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, కాంగ్రెస్,బీజేపీలు వంతులవారీగా, ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తున్నారు. ఆ లెక్కన ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలసి వుంది, కానీ, లెక్క తప్పింది. ఇక గోవా, మణిపూర్’లలోనూ బీజేపీ రెండవ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఇంచు మించుగా ఖాయంగా కనిపిస్తోంది. మరో వంక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పంజాబ్’లోనూ హస్తంపార్టీ, అధికారం కోల్పోయింది. అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ముఖ్యమంత్రిని మార్చినా, కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. చివరకు రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి చన్నీ, ఒకే స్థానంనుంచి పోటీచేసిన పీసీసీ చీఫ్, నవజ్యోతి సింగ్ సిద్దు కూడా ఓటమి దిశగా సాగుతున్నారు.పంజాబ్’ను చీపురు పార్టీ ( ఆప్) శుభ్రంగా తుడిచేసింది.మొత్తం 117 సీట్లకు గానూ, ఇంచుమించుగా 90 స్థానాల్లో ఆప్’ చీపురు తిరగేసింది. బీజేపీతో జట్టు కట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,12 సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు, ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు మాజీ మంత్రి సుఖీందర్ సింగ్ బాదల్  వీరూ వారని కాదు, మహా మహులు, హెమాహెమీలు అనుకున్న పంజాబ్ దిగ్గజ నేతలు అందరూ ఆప్ ప్రభంజనంలో కొట్టుకు పోయారు. ఇంతవరకు పంజాబ్ వేలుపా ఎవరికీ అంతగా తెలియని, భవత్ సింగ్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారు,అయితే పంజాబ్’లో ఇతర పార్టీలు ఓటమికీ, కాంగ్రెస్ పార్టీ ఓటమికి మధ్య చాలా వ్యత్యాసం వుందని, పరిసీలాకులు అంటున్నారు.  ఒక విధంగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం శ్రిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వలన పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని  కాంగ్రెస్ నాయకులే, ప్రతి అధిష్టానంఫై, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి, 2019 ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. 2021 లో జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళ నాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో ఒక్క తమిళనాడులో మిత్ర పక్షం డిఎంకే పుణ్యాన పది సీట్లు గెలుచుకుంది. కేరళ, అస్సాం లలో ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి ఒడి పోయింది. బెంగాల్’ లో సీపీఎం తో కలిసి పోటీ చేసినా ఖాతా తెరవలేదు. సో … ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
 
Tags:What was the situation of Rewant Reddy with the great defeat of the Congress?

Natyam ad