కేటీఆర్ ఎక్కడ.. ఆరా తీసిన ప్రధాని మోదీ…

హైదరాబాద్ ముచ్చట్లు:
నగరానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ మియాపూర్లోని మొదట పైలాన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మెట్రో స్టేషన్ను ప్రారంబించారు. అయితే రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడ్డారు. కేటీఆర్ ఎక్కడున్నారు? దగ్గరకు రావాలని మోదీ సూచించారు. కేటీఆర్ వచ్చిన తర్వాతే రిబ్బన్ కట్ చేశారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉన్నారు. అనంతరం మియాపూర్ స్టేషన్లో మోదీ తదితరులు మెట్రోరైల్పై ఎల్ అండ్ టీ ప్రదర్శించిన లఘ చిత్రాన్ని వీక్షించారు.తర్వాత వారంతా మెట్రో రైలు ఎక్కి కూకట్పల్లి వరకు తిరిగి మియాపూర్కు వచ్చారు.మెట్రోరైల్లో మోదీ ఉల్లాసంగా కనిపించారు. మోదీకి ఓవైపు గవర్నర్ నరసింహన్ కూర్చోగా రెండోవైపు కేటీఆర్ కూర్చున్నారు. గవర్నర్ పక్కన కేసీఆర్ ఆసీనులయ్యారు. మెట్రో విశేషాలను మోదీకి కేటీఆర్ వివరించారు.వారితో పాటు పలువురు మంత్రులు, అధికారులు, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు మెట్రోలో ప్రయాణించారు.
Tag : wheres-katie-modis-prime-minister-modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *