క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ పోటీల విజేతలు
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా గురువారం క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారి వివరాలిలా ఉన్నాయి.
క్యారమ్స్
– 45 ఏళ్లు పైబడిన మహిళల సింగిల్స్ పోటీల్లో శ్రీమతి వసుధ విజయం సాధించగా, శ్రీమతి జ్ఞానప్రసూన రన్నరప్‌గా నిలిచారు. 45 ఏళ్లు పైబడిన మహిళల డబుల్స్ పోటీల్లో శ్రీమతి సులోచనరాణి, శ్రీమతి జ్ఞానప్రసూన జట్టు గెలుపొందగా, శ్రీమతి కుసుమకుమారి, శ్రీమతి గీత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
టగ్ ఆఫ్ వార్
– 45 ఏళ్లు పైబడిన పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ యువరాజ్ జట్టు విజయం సాధించగా శ్రీ ఓబుల్‌రెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. 45 ఏళ్ల లోపు పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ బాలాజి సింగ్ జట్టు విజయం సాధించగా శ్రీ నాధముని జట్టు రన్నరప్‌గా నిలిచింది.
Tags: Winners of Carroms, Tug of War competitions