Wireless charging for all phones!

ఇక అన్ని ఫోన్లకూ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌!

ఈనాడు.

Date :07/01/2018

వాషింగ్టన్‌: ఖరీదైన ఫోన్లకు మాత్రమే పరిమితమైన వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని.. ఇకపై అన్ని ఫోన్లు, పరికరాలకూ వాడుకోవచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ అంకుర సంస్థ చేసిన ఎనర్జీస్క్వేర్‌ అనే ఆవిష్కరణతో ఇది సాధ్యపడింది. ఎనర్జీస్క్వేర్‌లో రెండు భాగాలుంటాయి. ఒకటి లోహపు స్టిక్కర్‌. దీన్ని ఫోన్‌ వెనుకవైపు అతికించుకుని ఛార్జింగ్‌ పోర్ట్‌తో అనుసంధానించుకోవాలి. మరొకటి అతిసన్నని ఛార్జింగ్‌ ప్యాడ్‌. దీనికి విద్యుత్‌సరఫరా అందించాలి. ఈ ప్యాడ్‌పై స్టిక్కర్‌తోనున్న ఫోన్‌ పెట్టగానే.. అది నేరుగా ఛార్జ్‌ అవుతుంది. ఇలా స్టిక్కర్‌ అంటించిన వివిధ పరికరాలను.. ప్యాడ్‌పై ఉంచి ఒకేసారి ఛార్జ్‌ చేసుకునే వీలుంది. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కోసం విద్యుదయస్కాంత (ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌) ఇండక్షన్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎనర్జీస్క్వేర్‌ మాత్రం విద్యుత్‌ వాహకత (ఎలక్ట్రిక్‌ కండక్షన్‌)పై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణ పద్ధతిలో ఛార్జింగ్‌ అయ్యేంత వేగంతోనే.. ఎనర్జీస్క్వేర్‌తోనూ పరికరాలు ఛార్జ్‌ అవుతాయి.

Tags: Wireless charging for all phones!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *