నాగార్జునతో అమల…

Date:14/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
నాగార్జున సరసన అమలది హిట్ పెయిర్, అమల నాగ్ కి జీవిత భాగస్వామి కూడా. అయితే ఇప్పుడు నాగ్ మరో అమలతో జతకడుతున్నాడు. మలయాళ నటి అమలపాల్ నాగ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. నాని, నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో కింగ్ సరసన నటించబోయే హీరోయిన్ అమల పాల్ అని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్ల ఎంపిక కష్టం అవుతోంది. యంగ్ హీరోల సరసన అవకాశాలు కావాలనుకునే అమ్మాయిలు సీనియర్ల పక్కన నటించడానికి నో చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోల సరసన అవకాశాలు రాని వారు మాత్రమే సీనియర్లకు ఓకే చెబుతున్నారు. అమలపాల్ కూడా ఇదే దశలో ఉంది.వివాహం, విడాకుల అనంతరం ఈమెకు యంగ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నాగ్ తో నటించడానికి ఈ హీరోయిన్ ఓకే చెప్పిందని సమాచారం. విశేషం ఏమిటంటే కొన్నేళ్ల కిందట నాగార్జున తనయుడి సరసన హీరోయిన్ గా నటించింది. నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమాలో హీరోయిన్ అమలపాల్. అప్పట్లో నాగ్ తనయుడి సరసన హీరోయిన్ నటించిన అమల ఇప్పుడు నాగ్ సరసనే నటించబోతోందనమాట! నాగచైతన్య సరసన నటించిన సినిమాతోనే అమల తెలుగుకు పరిచయం అయ్యింది.
Tags: With Nagarjuna …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *