భూ సమస్య పరిష్కారం కాలేదని కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్యం.

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు అన్నదమ్ములకు మూడెకరాల పై చిలుకు భూమి ఉంది. కాగా, అందులో ఇద్దరు మాత్రమే సేల్ డి.డి కింద రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా ఇద్దరిలో ఓ భాగస్తుడి భార్య అయిన నూర్జహాన్ తమకు అన్యాయం జరిగిందంటూ బుధవారం కలెక్టరేట్ ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో గమనించిన సెక్యూరిటీ గార్డు అడ్డుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.
 
Tags:Woman commits suicide before collectorate over land issue not resolved

Natyam ad