పీఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చౌటుప్పల్ మండలం జై కెసారం గ్రామానికి చెందిన బోదాసు అందాలు అనే మహిళ తన కొడుకు తో గొడవపడి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. పోలీసులు తన కొడుకుని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతుండగానే మహిళ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చి ఒక్కసారిగా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
Tags:Woman commits suicide in front of PS