మహిళ సంతోషమే సమాజ శ్రేయస్సు…

బద్వేలు ముచ్చట్లు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా   బద్వేలు సుమిత్ర నగర్ లోని శ్రీ సృజన్ హైస్కూలు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో కరస్పాండెంట్ పాలేటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మహిళ సంతోషమే సమాజ శ్రేయస్కరం అని పూర్వకాలం నుండి తెలుస్తోందని పేర్కొన్నారు.ద్రౌపది అవమానం కౌరవుల నాశనము సీతమ్మ అపహరణ వలన రావణుడి నాశనము జరిగిందని సతీసావిత్రి యమధర్మరాజును ప్రాధేయపడి భర్త ప్రాణాలను తిరిగి పొందిందని అలాగే
సతీ అనసూయ త్రిమూర్తులను సైతం పసిపిల్లవాళ్ళను చేసి ఆడుకోన్నదని,అరుంధతీ నక్షత్రంగా కొత్త పెళ్ళి జంటలకు దర్శనమిచ్చి ఆదర్శంగా నిలుస్తోందని,సతీ సుమతీ సూర్యుని సైతం అస్తమించ్చకుండా ఆపగల్గిందని ఇలాంటి ఎందరో ఆదర్శ మూర్తులను తెలుసుకోని అమ్మాయిలు కూతురుగా తల్లిదండ్రులకు గౌరవాన్ని భార్యగా ఆనందాన్ని,అమ్మగా పిల్లల భాద్యతను అత్తగా కోడలి అభిమానాన్ని అవ్వగా మనవల్ల ఆలనాపాలనా చూసుకోవాలని తెలిపారు.ఈకార్యక్రమంలో మహిళల పాటలు పాడి టీచర్లు రోజి,సభిత అలరించారు. పిల్లలు వారికి నచ్చిన మహిళను గురించి తెలిపారు. సృజన్ స్కూల్ చైర్మన్ వసంత లక్ష్మి, టీచర్లు హరిత కాశీంపీరయ్య సుబ్బారావు, సురేష్, యర్రపరాజు పాల్గొన్నారు..
 
Tags:Woman happiness is the well-being of society

Natyam ad