రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుండి ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్లు కు చెందిన రామేశ్వరి (48) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ రోడ్డు ప్రమాదంలో అనంతపురం కు చెందిన బస్సు డ్రైవర్ ఎస్ఎం. భాష, రూబీ పర్వీన్, బెలుగుప్ప చెందిన జోష్ణ, కర్నూలు చెందిన రఫీక్ అహ్మద్, శిల్ప, జైరాబీ, రవి కిరణ్, జొన్నగిరి గ్రామానికి చెందిన తులసి, పులివెందులకు చెందిన అఖిల, తమిళనాడుకు చెందిన రమేష్, వీర రాజు, కల్లుమడి గ్రామానికి చెందిన ఝాన్సీ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ఉన్న రామేశ్వరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
 
Tags:Woman killed in road accident

Natyam ad