ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి.
జగిత్యాల ముచ్చట్లు:
ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి చెందింది. మృతురాలు జాతరకు వెళ్తూ మృత్యు వాత పడింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద తాండ్రియాల కి చెందిన తెడ్డు వసంత (48) మృతి చెందింది. జాతర కు వెళ్తూ తాండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందింది. మాకు న్యాయం చేయాలంటూ బంధువులు,గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాంతో రాకపోకలు స్తంభించింది.
Tags:Woman killed in RTC bus collision