తెలంగాణలో మహిళా సాధికారత ప్రభుత్వం”పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి”  

—ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నర్సంపేట ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత ప్రభుత్వం ఉందని, ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే వంటింట్లో ఉన్న మహిళ రోడ్డుమీదికి వచ్చినప్పుడే ఆ దేశం అత్యున్నత స్థాయికి పోతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డిలు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న ఈ రోజు (మార్చి 8)న ప్రతీ ఏటా మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం  జరుగుతుందని, నేడు  మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు పురుషులతో సమానంగా పనిలో పోటీ పడుతున్నారని విద్యారంగంలో పోటీ పరీక్షల్లో సైతం విద్యార్థునులదే పైచేయిగా ఉందని వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ ల చేతుల మీదుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, దార్ల రమాదేవి, గుడిపూడి అరుణ, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లను, ఐసిడిఎస్ ఏసిడిపిఓ విద్య, సూపర్వైజర్లు, అంగన్ వాడి ప్రాజెక్ట్  అధ్యక్ష కార్యదర్శులు గొర్రె రాధ, బత్తిని శిరీష నర్సంపేట మున్సిపాలిటీ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్, ఎసిడిపిఒ విద్య, సూపర్వైజర్లు మంజుల, శ్యామల, రాధ, వాసంతి, రమ, టీఅరెస్కేవి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, టీఅరెస్కేవి నాయకులు పాలడుగు రమేష్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Women Empowerment Government in Telangana “Paddi Swapna Sudarshan Reddy”

Natyam ad