పుంగనూరులో మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకే జగనన్న పోషణ కార్యక్రమం క్రింద పోషక పదార్థాలను గర్భవతులకు , తల్లులకు పంపిణీ చేస్తున్నట్లు కౌన్సిలర్లు యువకుమారి తెలిపారు. సోమవారం సూర్యనగర్‌లో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రంలో పోషక పదార్థాలను మహిళలకు పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పుణ్యవతి, ధనలక్ష్మి, వనిత, హిమజ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Women should be healthy in Punganur
 

Natyam ad