గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ స్టౌవ్‌లవద్ద మహిళలు అప్రమత్తంగా ఉండాలి

చౌడేపల్లె ముచ్చట్లు:
 
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌స్టౌవ్‌లు వెలిగించే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు ఇన్‌చార్జి ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ నందకుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పుదిపట్ల ఉన్నతపాఠశాలలో స్కూల్‌ ఆవరణంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు సంభించన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రమాదానికిన గురైన వ్యక్తిపట్ల తీసుకోవాల్సిన మెళకువలను తెలియజేశారు.వంట శాలలో మహిళలు కాటన్‌ దుస్తువులు వాడాలని సూచించారు.ప్రమాదాలు జరిగిన సమయంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాలను ఏవిధంగా ఎదుర్కొనే సన్నివేశాలను డెమోద్వారా పిల్లలకు చూపించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పద్మజ, అగ్నిమాకపసిబ్బంది సుమన్‌, లక్ష్మినారాయణ,వేలుమలైశెట్టి, యూనస్‌, మల్లికార్జున, మోహన్‌, ఇమ్మానుయేల్‌ తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Women should be vigilant at gas stoves in rural areas

Natyam ad