పురుషులతో సమానంగా సరిహద్దు రక్షణలో గస్తీ మహిళా సైనికులు.
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశ రక్షణలో మహిళలు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో గస్తీ కాస్తూ ఔరా అనిపిస్తున్నారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ విధులు నిర్వహిస్తున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్హరించుకొని.. ఐటీబీపీకి చెందిన మహిళా జవాన్లు అరుణాచల్ ప్రదేశ్ – చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా జవాన్లకు వుమెన్స్ డే శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.ఇక దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన మహిళామణులను సన్మానించి, సత్కరిస్తున్నారు.
Tags:Women soldiers patrolling the border on an equal footing with men