కోరుకొండలో ఘనంగా మహిళ దినోత్సవం-గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు కి సన్మానం

గోకవరం ముచ్చట్లు:
కోరుకొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.. గురువారం జరిగిన కార్యక్రమానికి గోకవరం మండల ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు పాల్గొన్నారు.. కోరుకొండ ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనేకమందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ప్రసంగించారు.. అంతర్జాతీయ మహిళ దినోత్సవ విశిష్టత గురించి వివరించారు.. కుటుంబంలో ఎటువంటి ఆటుపోట్లు వస్తాయి, వాటిని మహిళలు ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొంటారో వివరించారు.. అనంతరం గోకవరం ఎంపీపీకి పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాల నుండి కొందరు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు..
 
Tags:Women’s Day in Korukonda – Tribute to Gokavaram MP Sunkara Srivalli Veerababu

Natyam ad