ఊరికోసం బంగారాన్ని తాకట్టుపెట్టిన మహిళా సర్పంచ్…

వరంగల్ జిల్లా ముచ్చట్లు:
బంగారమంటే ఆడవాళ్లకు చెప్పలేనంత మోజు…. ఆ బంగారాన్ని ఎంత అవసరం వచ్చినా తాకట్టుపెట్టడానికి ఇష్టపడరు. అయితే ఓ మహిళ సర్పంచ్ తన బంగారాన్ని ఊరికోసం తాకట్టుపెట్టింది. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసింది. గడువులోగా గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా.. ఓడీఎఫ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది.
ఇది వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామం. ఇక్కడ మొత్తం 410 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటివరకు 320 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. మరో 74 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మిస్తున్నారు. ఇంకా 16 మరుగుదొడ్లు నిర్మిస్తే కానీ ఊరు బహిరంగ మలవిసర్జనరహిత గ్రామం..ఓడీఎఫ్ గా గుర్తింపు పొందే అవకాశం లేదు. గడువులోగా ఓడీఎఫ్ గా మారిన గ్రామాలకు కలెక్టర్ 5 లక్షలు, ఎమ్మెల్యే మరో 5లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో గ్రామాన్ని ఓడీఎఫ్గా మార్చడానికి సర్పంచ్ భారతి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.లబ్ధిదార్లు మొదట తమ డబ్బులతో మరుగుదొడ్లు నిర్మించుకుంటే తర్వాత ప్రభుత్వం ఒక్కో నిర్మాణానికి 12వేల రూపాయలు ఇస్తుంది. ముత్తారంలో కొన్ని గిరిజన దళిత కుటుంబాలు ముందు డబ్బులు పెట్టి మరుగుదొడ్లు నిర్మించుకునే స్థితిలో లేరు. దీంతో సర్పంచ్ కొర్రి భారతి నేనున్నానంటూ ముందుకొచ్చారు. తన బంగారాన్ని ఓ ప్రైవేటు వ్యాపార సంస్థలో తాకట్టు పెట్టారు. ఆ డబ్బుతో ఊళ్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడానికి సామాగ్రిని కొనుగోలు చేశారు. నవంబర్ 26లోగా తమ గ్రామాన్ని ఓడీఎఫ్ గా మార్చేందుకు ఆమె కష్టపడుతున్నారు. ఊర్లో వంద శాతం మరుగుదొడ్లు పూర్తయితే.. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరో 10లక్షలు అదనంగా వస్తాయనే తపనతోనే బంగారాన్ని తాకట్టు పెట్టానని భారతి చెబుతున్నారు. లబ్ధిదారులకు బిల్లులు వచ్చాక బంగారాన్ని విడిపించుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ భారతి చేస్తున్న కృషిని ఎంపీడీవో సహా ఇతర అధికారులు ప్రశంసిస్తున్నారు. బంగారాన్ని తాకట్టుపెట్టడమే కాకుండా…. తమకున్న పడిపశువులతో వచ్చే ఆదాయంలో నుంచి కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ భారతి డబ్బులు వెచ్చిస్తున్నారు. స్వచ్ఛభారత్ కోసం… స్వచ్ఛమైన మనసుతో సర్పంచ్ భారతి ప్రయత్నిస్తోందని గ్రామస్తులు అభినందిస్తున్నారు.మన సర్పంచ్ లు కూడా చుసీ పాటీంచండీ మీఆప్ నాయకుడు వేల్పుల వేంకన్న
Tag : Women’s sarpanch hammered gold


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *