Working for Venkatapuram Panchayat Development: Bujji

వెంకటాపురం పంచాయతీ సమగ్రాభివృద్ధికి కృషి: బుజ్జి

Date: 05/01/2018

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురం పంచాయతీ సమగ్రాభివృద్ధికి అహర్నిశలుకృషి చేసి వెంకటాపురం గ్రామస్ధులకు అండగా ఉంటానని ఏలూరు శాసనసబభ్యులు బడేటి కోట రామారావు(బుజ్జి) భరోసా ఇచ్చారు. ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురం పంచాయతి హనుమాన్‌ నగర్‌లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ వెంకటాపురం గ్రామపంచాయతీలో అవసరమైన అన్నీ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించి గ్రామప్రజలకు కొండంత అండగా ఉంటానన్నారు. వెంకటాపురం పంచాయతీలో ప్రజలకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు. అక్కడ కావాల్సిన రోడ్లు, డ్రైయిన్లు, త్రాగునీరు, విద్యుత్తు, తదితర మౌలిక సదుపాయాలతోపాటు అర్హులైనవారికి పెన్షన్లు, ఇళ్లు మంజూరుకోసం వివరాలను సేకరించి వాటిని పరిశీలించి అమలు చేయడానికి అన్నీవిధాల చర్యలు తీసుకుంటామని బడేటి బుజ్జి చెప్పడంతో సభలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు తమ హర్షధ్వానాలు తెలిపారు. ఏలూరునగరంలో వెంకటాపురం పంచాయతీని విళీనం చేసి పట్టణవాసులకు అందుతున్న అన్నీ సౌకర్యాలుకల్పిస్తామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. వెంకటాపురం పంచాయతీలో స్వంత నిధులు లక్ష రూపాయలతో ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బుజ్జి హామి ఇచ్చారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లలు వివాహ నిమిత్తం ఉగాదినుండి చంద్రన్న పెళ్లికానుక క్రింద ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లలు వివాహం కార్యక్రమం భారంకాకుండా ఉండేందుకు చంద్రన్న పెళ్లికానుక ద్వారా బిసి కుటుంబాలకు రూ. 35 వేలు, యస్‌సిలకు రూ. 40 వేలు, గిరిజనులు, ముస్లింలకు రూ. 50 వేలు చొప్పున ఆర్ధికసహాయం అందించాలని సియం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. కేవలం వివాహానికి ఆర్ధిక సహాయమే కాకుండా బాల్యవివాహాలు నివారించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్‌ చేయడంద్వారా వధువుకు రక్షణ కల్పించడం చంద్రన్నపెళ్లికానుక పధకం రూపుదిద్దుకుందన్నారు. ఇందుకోసం ఆధార్‌తో పాటు అవసరమైన కుల, జన్మ, నివాస ధృవపత్రం, తెల్లరేషన్‌ కార్డు, పెళ్లికుమార్తె బ్యాంకు వివరాలు అందించవలసి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమంకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే బడేటి బుజ్జి వివరిస్తూ అర్హులైన పేదకుటుంబాలకు స్వంతఇంటికల సాకారం చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఇందులోభాగంగా ఏలూరు నియోజకవర్గంలో 12 వేల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. యన్‌టిఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌ క్రింద ఒక్కొక్కగృహానికి బ్యాంకు రుణంక్రింద 75 వేలు, లబ్దిదారుని వాట 25 వేలు కలిపి రూ. 3.5 లక్షలు ఖర్చు అవుతుందని అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో అందిస్తున్నాయన్నారు. యన్‌టిఆర్‌ గృహనిర్మాణం క్రింద ఒక్కో ఇంటికి రూ. 1.5 లక్షలు కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 95 వేలు సబ్సిడీ క్రింద, జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకంక్రింద 55 వేలు ఇస్తున్నదన్నారు. రాష్ట్రంలో 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. చంద్రన్న బీమా నిరుపేదకుటుంబాలకు ధీమాగా నిలుస్తున్నదనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. ప్రమాదవశాత్తు కుటుంబయజమాని మరణిస్తే ఆకుటుంబాలు వీధిపాలు కాకుండా చంద్రన్న బీమా ఎంతో అండగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్లలో సియం చంద్రబాబునాయుడు నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేసుకోవడంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణపను శరవేగంగా జరుగుతున్నాయని ఇందుకు సియం చంద్రబాబు సమర్ధతకు నిదర్శనమన్నారు. క్రిష్టమస్‌, రంజాన్‌, సంక్రాంతి పండుగల్లో పేద కుటుంబాల్లో సంతోషం కనపడాలనే ఉద్దేశ్యంతో రంజాన్‌ తోఫా, క్రిష్టమస్‌ కానుక, చంద్రన్న సంక్రాంతికానుకలను అందించడం జరిగిందన్నారు. పెన్షన్లు ప్రతీ నెలా 5వ తేదీలోపు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అయితే కొంతమంది 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని ప్రస్తుతమిచ్చే మొత్తాన్ని మరింత పెంచుతామని కల్లబొల్లి కబుర్లతో వస్తున్నారని అదేగానీ జరిగితే సోమరితనం పెరిగి సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడేవారు పెరుగుతారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. అటువంటి మోసపు మాటలకు ఆకర్షితులు కాకుండా వాస్తవాలను దృష్టిలోపెట్టుకుని ప్రజాసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను వాస్తవంగా అమలు చేస్తున్న సియం చంద్రబాబునాయుడుకు ప్రజలు పూర్తి అండదండలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షులు లంకలపల్లి మాణిక్యాలరావు, సర్పంచ్‌ చెరుకూరి దీప్తీ ఉషా, తహశీల్ధారు చంద్రశేఖర్‌, ఎఎంసి ఛైర్మన్‌ పూజారి నిరంజన్‌, యంపిటిసిలు పైడి వెంకటేశ్వరరావు, మాతల రమేష్‌, దావూద్‌, అంబటి రజని, మెరుగుమాల శ్రీను, వార్డు మెంబర్లు చిన్ని చలపతిరావు, చిన్ని అర్జున్‌, శేఖర్‌, దుర్గ, మండల పార్టీ అధ్యక్షులు అమరావతి అశోక్‌, ఏలూరు ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ లింగిశెట్టి శశికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags: Working for Venkatapuram Panchayat Development: Bujji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *