ప్రపంచ మహిళ దినోత్సవ ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు
 
ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం పుంగనూరు బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ కె.కె కమలాకర్ అధ్యక్షతన ప్రపంచ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాలికలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించి దిశ చట్టం, బాల్యవివాహాలు,అక్రమ రవాణా,మహిళ ఉన్నతి పై నినాదాలు చేస్తూ కోనేరు వద్ద మానవహారం వేశారు.అనంతరం మహిళ దినోత్సవ సంబరాలు చేశారు.మహిళ అధ్యాపకులను దుశ్శాలువ తో సన్మానించి ఆటపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయ కుమారి,భారతి, దేవిక,సుమలత,నాగేశ్వరి,కమలమ్మ,బాలరాజు నాయక్,చెంగయ్య, ఇస్మాయిల్,ఎఫ్.టి శ్రీనివాసులు తతితరులు పాల్గొన్నారు.

Tags:World Women’s Day Rally

Natyam ad