మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “సాక్ష్యం” 

Date:19/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ – యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న “సాక్ష్యం” తాజా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
విడుదలైన టైటిల్ లోగో మొదలుకొని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ కు కూడా విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ జరుగుతోంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా అభినేష్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ డైరెక్షన్ స్కిల్స్, ఆయన స్క్రిప్ట్ “సాక్ష్యం” సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా మలుస్తున్నాడు శ్రీవాస్. బెల్లంకొండ శ్రీనివాస్ ఇమేజ్ కి మంచి మేకోవర్ ఇచ్చే చిత్రమిది. డూప్ లేకుండా శ్రీనివాస్ చేసిన యాక్షన్ సీన్స్, పూజా హెగ్డేతో రొమాన్స్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. రామోజీ ఫిలిమ్ సిటీ షెడ్యూల్ పూర్తవ్వగానే చిత్రబృందం ఆఖరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో చిత్రించబోయే కీలక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తవుతుంది. మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న “సాక్ష్యం” ష్యూర్ షాట్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య  తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Tags: Worldwide release of “evidence” on May 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *