ఘనంగా శ్రీ పంచమి పూజలు

యానం ముచ్చట్లు:
 
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శారదా దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితులు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆలయంలోని అమ్మవారికి తెల్లవారుజాము నుండి భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి.అభిషేకాలు, పెన్నులు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పరిసర ప్రాంతాలకు చెందిన చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు.
 
Tags; Worship Sri Panchami richly

Natyam ad