Yesterday's tight law .. Another triple talaq today

నిన్న కఠిన చట్టం.. నేడు మరో ట్రిపుల్‌ తలాక్‌

Date 29/12/2017

లక్నో ముచ్చట్ల:

ట్రిపుల్‌ తలాక్‌ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం ముద్ర వేయించుకున్న మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్‌లో మరో వ్యవహారం వెలుగు చూసింది. మొరానాబాద్‌కు చెందిన వరిషా.. తన భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చాడని చెబుతున్నారు. ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె… ‘‘నా భర్త కట్నం కోసం గత కొంత కాలంగా హింసిస్తున్నాడు. 10 లక్షల రూపాయలు లేదా కారు ఏదో ఒకటి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ వెంటనే ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చానన్నాడు’’ అని వరిషా చెప్పారు. అయితే ఈ అంశంపై ఆమె భర్త, పోలీసులు స్పందించాల్సి ఉంది. కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. అయితే ప్రస్తుతం అది రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది.

Tags : Yesterday’s tight law .. Another triple talaq today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *