మీకు మీరే.. మాకు మేమే..

Date:12/03/2018
అమరావతి ముచ్చట్లు:
నిధులు, విభజన హామీల ఇష్యూలో కేంద్రం మోసం చేసిందన్న భావన ఆంధ్రప్రదేశ్ ను దహించేస్తోంది. బీజేపీకి చెందిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. తమ పదవులకు రాజీనామాలు ఇచ్చారు. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. మోడీ నాయకత్వం తమను మోసగించిందని ఆవేదన వెళ్లగక్కారు. ప్రజల్లోనూ కేంద్రంపై వ్యతిరేకత తారస్థాయికి చేరుకుంది. ఆందోళన, నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. మొత్తంగా రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన విపక్షం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం.. స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిందన్న కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని నేపాల్ లో టూర్ కు వెళ్లడం వల్లే ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజలు.  వాటన్నింటికీ తాము భిన్నం అనే తరహాలో వైసీపీ వ్యవహరిస్తోంది. విభజన హామీలు నెరవేరకపోవడం, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం ఏదో తాత్కాలిక అంశంలా భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికకు మించిన ఇంపార్టెంట్ విషయం మరోటి లేదన్నట్లు ఈ ఎన్నికకు ఎక్కడాలేని ప్రాధాన్యతనిస్తోంది.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కంటే పెద్దల సభలో స్థానం దక్కదన్న ఆందోళనే వైసీపీలో అధికంగా ఉంది. అందుకే ఆ పార్టీ అధినేత జగన్ తమ 40 మంది ఎమ్మెల్యేలను దేశం దాటించేశారని పలువురు విమర్శిస్తున్నారు. సొంతంగా ఆలోచించడం ఏనాడో మానేసిన విపక్ష నేతలంగా తమ నాయకుడు చెప్పిందే వేదంగా భావించి నేపాల్ వెళ్లిపోయారు. కష్టకాలంలో ప్రజలకు మద్దతుగా ఉంటే భావన ఏ ఒక్కరికీ కలగలేదేమో? ఈతరహా రాజకీయం తమను ప్రజలకు దూరం చేస్తుందన్న ఆలోచన గానీ.. జనాలు ఛీ కొడతారన్న డౌట్ గానీ రాలేదేమో? జగన్ కు అత్యంత విశ్వాసపాత్రులు, సన్నిహుతులైన నలుగురు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దేశంలోనే ఉన్నారు. వ్యక్తిగత పనుల వల్లే వీరు ఇక్కడే ఉన్నారని.. లేదంటే నేపాల్ లోనే ఉండేవారన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా జగన్ అనుసరిస్తున్న వైఖరి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన తమ ఎమ్మెల్యేలను నమ్మడంలేదా? తనకు హ్యాండిస్తారని భావిస్తున్నారా? అసలు ఎమ్మెల్యేలపై జగన్ కు పట్టుందా? లేదా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన అనుచరగణాన్ని ఏమాత్రం విశ్వసించని నాయకుడిగా వైసీపీ అధినేత జగన్ పై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోనవుతారేమోనన్న డౌట్ ఆయన్ను వెంటాడుతోందని.. అందుకే వారిని మరో దేశం తోలేశారని పలువురు అంటున్నారు. ఆయన భావనలు, భయాలు ఎలా రాష్ట్రం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో జగన్ చేస్తున్న రాజకీయం విమర్శల పాలవుతోంది.
Tags: You are yourself ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *